● ప్రారంభానికి నోచుకోని రేవనూరు గ్రామ సచివాలయం
● అరకొర వసతులున్న భవనంలో గ్రామ సచివాలయం
కోవెలకుంట్ల: గ్రామస్థాయిలో పరిపాలనను వికేంద్రీకరణ చేస్తూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రజలకు సేవలందించే ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు ఉండాలన్న సంకల్పంతో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు రాజభవనాల తరహాలో అన్ని హంగులతో భవనాలు నిర్మించింది. కోవెలకుంట్ల మండలం రేవనూరులో రూ. 38.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా మారింది. అనివార్య కారాణాలతో గత ప్రభుత్వం భవనాన్ని ప్రారంభించలేకపోయింది. 2024 సంవత్సర ఎన్నికల్లో చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చింది. రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోలేదు. గతంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే సచివాలయ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ భవనంలో అరకొర వసతులు ఉండటంతో ఉద్యోగులు, కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని వసతులతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని ఉద్యోగులు, ప్రజలు కోరుతున్నారు.


