వైఎస్సార్‌సీపీ నాయకులపై రాళ్ల దాడి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకులపై రాళ్ల దాడి

Oct 23 2026 2:15 AM | Updated on Oct 23 2026 2:15 AM

టాస్క్‌ఫోర్స్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నాయకులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన కృష్ణగిరిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. రాళ్లదాడిలో కానిస్టేబుల్‌ రాఘవేంద్రప్రసాద్‌ తలకు గాయమైంది. వైఎస్సార్‌సీపీ చెందిన చిట్యాల ఎంపీటీసీ అభ్యర్థి బాల ఈశ్వరయ్య, ఎరుకలచెరువు ఎంపీటీసీ అభ్యర్థి బోయ సంజమ్మ, చిట్యాలకు చెందిన ముద్దారం రామలింగడు, రమేష్‌, భూతం మల్లికార్జున, లాలప్ప, గోపాల్‌, కోయిలకొండకు చెందిన కొక్కు మద్దిలేటి, కృష్ణ, నడిమింటి మదన్‌, మన్నెకుంటకు చెందిన చిన్న బజారి, బోయ వెంకటేశ్వర్లు గాయపడ్డారు. ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు.

నామినేషన్‌ వేసే అవకాశం కల్పించాలి

గొడవ జరిగిన అనంతరం కర్నూలు నుంచి వచ్చిన సీఐ మారుతి శంకర్‌ తమకు నామినేషన్‌ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు ముద్దారం బాల ఈశ్వరయ్య, బోయ సంజమ్మ, కరివేములు వెంకటేశ్వర్లు తదితరులు తెలిపారు. అయితే సాయంత్రం ఐదు గంటలు కాగానే పోలీసులు సైతం ఏ విషయం చెప్పకుండా వెళ్లిపోయారన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఎక్కడైనా ఉన్నామని అని ప్రశ్నించారు. ఓట్ల కోసం ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేక నామినేషన్‌ అడ్డుకోవడం సరికాదన్నారు. పోలీసులు రక్షణగా ఉండి తమకు నామినేషన్‌ అవకాశం కల్పించాలని కోరారు.

చిన్న బజారి,

మన్నెకుంట

బోయ వెంకటేశ్వర్లు, మన్నెకుంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement