వైఎస్సార్‌సీపీ నాయకుల హౌస్‌ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకుల హౌస్‌ అరెస్ట్‌

Oct 23 2026 2:15 AM | Updated on Oct 23 2026 2:15 AM

వెల్దుర్తి: నామినేషన్లు వేసేందుకు వెళ్లకుండా వైఎస్సార్‌సీపీ నాయకులను గురువారం తెల్లవారుజాము నుంచే పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బొమ్మన రవిరెడ్డిని వెల్దుర్తిలోని ఆయ స్వగృహంలో, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిఽధి ఎల్‌ నగరం గ్రామ సమీర్‌ కుమార్‌ రెడ్డి అతని స్వగృహంలో హౌస్‌ అరెస్టు చేశారు. గురువారం మధ్యాహ్నం నుంచి నామినేషన్లు వేసేందుకు అవకాశాలు ఇస్తామని సాయంత్రం వరకు వదల్లేదు. వెల్దుర్తి మండలంలో ఉన్న 17 ఎంపీటీసీ స్థానాలలో కేవలం చెరకులపాడు స్థానంలో నామినేషన్‌ వేశారు. మిగతా 16 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్‌ వేయాలనుకున్న వైఎస్సార్‌సీపీ నాయకుల, కార్యకర్తల ఆశలకు గండికొట్టారు. శుక్రవారం అయినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పోలీసులు నామినేషన్లు వేయిస్తారో లేదో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement