కర్నూలు(అర్బన్): ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రెండు రోజులుగా సాగుతున్న నామినేషన్ల ప్రక్రియలో జిల్లాలోని మొత్తం 432 స్థానాలకు గురువారం సాయంత్రానికి 1,154 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటిరోజు ఈనెల 21న 168, 22వ తేదీన 986 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో టీడీపీకి 516, వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా 499 మంది అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. రెండు రోజులుగా సాగుతున్న ఈ ప్రక్రియలో అత్యధికంగా కోడుమూరు మండలంలో 79, గోనెగండ్లలో 78, ఆస్పరిలో 77 నామినేషన్లు దాఖలైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు.


