● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు (టౌన్): సంక్షేమ పథకాలు అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి మహిళలే బుద్ధి చెబుతారని వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు 1వ వార్డులోని ఖండేరి వీధిలో వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి సుశీల, కార్పొరేటర్ అభ్యర్థి జులేఖాబీ ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, మణీగాంధి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరిలు, సీఈసీ సభ్యులు రాంపుల్లయ్య యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డనిధి కింద ప్రతి నెలా రూ.1,500 ఇస్తామని హామీ టీడీపీ నేతలు మోసం చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఇప్పటి వరకు రూ. 4 వేల పింఛన్ ఇవ్వలేదన్నారు. ఆరు ఉచిత సిలిండర్లు ఇస్తామని మోసం చేశారాన్నారు. నిరుద్యోగ యువతులకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని టీడీపీ నేతలను నిలదీయాలన్నారు. వైఎస్సార్‌సీపీ మహిళా వర్కింగ్ ప్రెసెడింగ్ ఎస్వీ విజయ మనోహరి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు చేస్తున్నారన్నారు. ప్రజలకు మేలు చేసిన వైఎస్సార్‌సీపీకి ఓటు వేసి మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. 67 వ వార్డు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థి పసుల అనిత, 1వ వార్డు మాజీ కార్పొరేటర్ షాషావలీ, కళ్యాణి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


