స్థానిక ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తథ్యం | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తథ్యం

Oct 20 2026 4:49 AM | Updated on Oct 20 2026 4:49 AM

బేతంచెర్ల: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తప్పని సరిగా ఓడిపోతుందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. బేతంచెర్ల పట్టణంలోని శేషారెడ్డి నగర్‌ కాలనీలో మూడు వార్డుకు చెందిన పలువురు మాజీ మంత్రి సమక్షంలో సోమవారం టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ నాయకులు మాజీ వార్డు కౌన్సిల్‌ సభ్యుడు చింతల నాగిరెడ్డి, దూదేకుల మా బాషా ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన అబ్దుల్‌ సలాం, చిన్న గుమ్మ వెంకటేశ్వర్లు, ప్రకాష్‌, సత్యం, శ్రీనివాసులు, హుస్సేన్‌ బాషా, ఆంజనేయులుతోపాటు మరో 13 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. మాజీ మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement