టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక

Oct 20 2026 4:49 AM | Updated on Oct 20 2026 4:49 AM

కల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. సోమవారం ఓర్వకల్లు మండలం లొద్దిపల్లె గ్రామంలోని టీడీపీకి చెందిన 30 కుటుంబాలు ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరాయి. వీరందరికి వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటసాని శివనరసింహారెడ్డి వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కాటసాని మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామన్నారు. ఓర్వకల్లు, కల్లూరు, గడివేముల, పాణ్యం మండలాల్లో ఎంపీపీలు, జెడ్పీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించాలన్నారు. వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో లొద్దిపల్లె టీడీపీ నాయకులు శాపురి శ్రీనివాసులు, శాపురి పెద్దయ్య, కురువ శ్రీరాములు, డబ్బుల ఎల్లస్వామి, ఉలువల కృష్ణుడు, నేశా పుల్లయ్య, చాకలి మద్దిలేటి, షేక్‌ నూర్‌ అహమ్మద్‌, శాపురి భరత్‌, ఉలువల మధు, కోర్రు మధు తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement