● నిర్ణయం తీసుకున్న
పల్లెదొడ్డి గ్రామ ప్రజలు
దేవనకొండ: ప్రతియేటా శ్రావణమాసం మూడో మంగళవారం గద్దెరాళ్ల మారెమ్మవ్వ పుట్టినిల్లు అయిన పల్లెదొడ్డి నుంచి వందల సంఖ్యలో బోనాలు వస్తాయి. ఇలా సమర్పిస్తే గద్దెరాళ్ల మారెమ్మ చల్లని చూపు చూసి పంటలు బాగా పండుతాయని ప్రజల నమ్మకం. అయితే పల్లెదొడ్డి గ్రామస్తులను సంప్రదించకుండా టీడీపీ నేతలు వివిధ గ్రామాలకు చెందిన వారిని గద్దెరాళ్ల మారెమ్మ ఆలయ కమిటీ సభ్యులుగా నియమించారు. పల్లెదొడ్డి గ్రామ ప్రమేయం లేకుండా చైర్మన్ పదవి కేటాయించారు. దీంతో పల్లెదొడ్డి గ్రామస్తులు శ్రావణ మాసం మూడో మంగళవారం నిర్వహించే అమ్మవారికి చల్లదనం ఉత్సవాలకు బోనాలు తీసుకెళ్లడాన్ని నిషేధించారు. ఇదే కార్యక్రమాన్ని పల్లెదొడ్డి గ్రామంలోనే జరుపుకుంటామని గ్రామపెద్దలు శుక్రవారం నిర్ణయించారు.


