చుక్క నీరు లేని జలాశయాలు.. పైర్లన్నీ ఎండిన పొలాలు.. సేద్యాలు చేయని రైతుల భూములు.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎడారి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎటుచూసినా కరువు దరువేస్తోంది. అయితే గోరుకల్లు జలాశయం, దాని చుట్టూ ఉండే ప్రాంతం కరువును జయించింది. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన జలయజ్ఞంతో ఈ ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. భూగర్భ జలాలు పెరిగి రైతుల భూములను సస్యశ్యామలం చేస్తోంది. తీవ్ర కరువులోనూ బోరుబావుల కింద పచ్చని పంటలను చూసిన ప్రజలు వైఎస్సార్ పాలన, అప్పటి ప్రభుత్వం చేసిన మేలును గుర్తు చేసుకుంటున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు
జలసోయగం: గోరుకల్లు రిజర్వాయర్‌లో నిల్వ ఉన్న నీరు
మొలకెత్తిన సౌరభం : కళకళలాడుతున్న పొగాకు నారుమడి
వరించిన అదృష్టం: పచ్చగా కళకళలాడుతున్న వరిపొలం
మట్టి పరిమళం: ట్రాక్టర్‌తో పొలాన్ని సిద్ధం చేస్తూ..


