ప్రొద్దుటూరు క్రైం: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఎర్రగుంట్ల రోడ్డులోని వాసవీ సర్కిల్ సమీపంలో గంజాయిని విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో వన్‌టౌన్ సీఐ టీవీ కొండారెడ్డి, ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డిలు సిబ్బందితో కలసి దాడులు నిర్వహించారు. దాడిలో షేక్ జాఫర్ అలియాస్ కొంగల తల్లి (27) పోలీసులు అరెస్టు చేసి.. అతని వద్ద ఉన్న 50 ప్యాకెట్లలోని 385 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నంద్యాల జిల్లా చాగలమర్రి మండలానికి చెందిన వాడని, ప్రస్తుతం ప్రొద్దుటూరు పెన్నానగర్‌లో నివాసం ఉంటూ ట్రాక్టర్ డ్రైవర్‌గా, కూలీగా పనిచేస్తున్నాడని తెలిపారు. గతంలోనూ అతనిపై గంజాయి సంబంధిత కేసులు నమోదై జైలుకు వెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. అతనిపై కేసు నమో దు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్టు సీఐ తెలిపారు.


