మాకు మూడు ఎకరాల సొంత భూమి ఉంది. మరో మూడు ఎకరాలను కౌలుకు తీసుకున్నాం. నాలుగు ఎకరాల్లో పత్తి, ఒక ఎకరాలో మిర్చి సాగు చేశాం. ఒక ఎకరాలో వరి సాగు చేయడానికి 45 రోజుల క్రితం నారుపోశాం. బోరులో నీరు లేకపోవడంతో వరి నాట్లకు అవకాశం లేకుండా పోయింది. వర్షాలు లేకపోవడం, భూమిలో తేమ ఆరిపోవడంతో పత్తి ఎండిపోతోంది. పత్తి సాగుకు ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయాం. కోసిగి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి ఆదుకోవాలి. – పి.బషీర్, కామన్‌దొడ్డి, కోసిగి మండలం


