ఆసుపత్రిలో ఐపీ భవనం నిర్మాణం వేగంగా జరుగుతున్న క్రమంలో పనులను చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. ఈ భవనం పూర్తయితే రోగులకు ఎంతో మేలు జరుగుతుందని ఆనందించారు. కానీ వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐపీ భవన నిర్మాణ పనులను ఆపింది. దీంతో పాటు కళాశాలలో లెక్చరర్ గ్యాలరీ, ఎగ్జామినేషన్ హాలు నిర్మాణం పూర్తికావచ్చిన దశలో పనులు ఆగిపోయాయి. వీటికి సంబంఽధించి పెండింగ్ బిల్లులను ఇప్పటివరకు కాంట్రాక్టర్లకు ఇవ్వలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐపీ భవనానికి రూ.60.5కోట్లకు గాను రూ.42కోట్లు, లెక్చరర్ గ్యాలరీకి, ఎగ్జామినేషన్ హాలుకు పనులు జరుగుతుండగానే దాదాపుగా బిల్లులు చెల్లించారు.


