చినుకు రాలడం లేదు.. పొలంలో వేసిన విత్తనం మొలకెత్తలేదు.. గుక్కెడు నీరు కూడా కరువయ్యాయి...దుస్థితిని తొలగించాలని వరుణ దేవుడు కరుణించాలని హొళగుంద ప్రజలు శనివారం రాత్రి జోలె పట్టి భిక్షాటన చేశారు. తమలో ఎలాంటి అహంకారం లేదని వర్షం కురువాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లు పెద్దమ్మవ్వ ఆలయ పరిసర ప్రజలు తెలిపారు. చిన్న పిల్లలు, మహిళలు, పెద్దలు అందరూ బృందాలుగా వీడి పరిసర వీధుల్లో కలియ తిరిగారు. ఇంటింటికి వెళ్లి జోలె పట్టి పాటపాడుతూ అడుక్కున్నారు. ఇలా తిరిగి సేకరించి డబ్బును, ధాన్యాన్ని దైవ కార్యానికి వాడుకుంటామని తెలిపారు. భిక్షమేసిన వంటలను అందరూ కలిసి భోజనం చేశారు. – హొళగుంద
జోలె వేసుకున్న మహిళ, భిక్షమెత్తుతున్న దృశ్యం


