శ్రీశైలంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి

Jul 13 2026 4:37 AM | Updated on Jul 13 2026 4:37 AM

శ్రీశైలంటెంపుల్‌: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శరత్‌ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన న్యాయమూర్తి దంపతులకు ఆలయ రాజగోపురం వద్ద దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శరత్‌ దంపతులు మల్లికార్జున స్వామివారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అలాగే భ్రమరాంబాదేవిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో న్యాయమూర్తి దంపతులకు వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన ఏఈఓ స్వాములు స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందించి సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement