కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో గత జూన్ 27న నిర్వహించిన డిగ్రీ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఫలితాలు https://rayalseemauniversity.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఐదవ సెమిస్టర్ బీఏ కోర్సుకు 74, బీబీఏ ఒకరు, బీసీఏ నలుగురు, బీకాం 143 మందికి 139, బీఎస్సీ 174 మందికి 170 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు.
ఆదోని ఆర్‌డీఓగా కె.అరుణకుమారి
కర్నూలు(సెంట్రల్): ఆదోని ఆర్‌డీఓగా కొంకని ఆరుణకుమారి నియమితులయ్యారు. ఈమేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు అక్కడ ఆర్‌డీఓగా ఏపీఐఐసీ జెడ్‌ఎం వై.మధుసూదన్‌రెడ్డి ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించా రు. మరోవైపు గత ప్రభుత్వం ఆదోని డివిజన్‌కు సబ్ కలెక్టర్‌ను నియమించేది. ఐఏఎస్ అధికారికి సబ్‌కలెక్టర్ బాధ్యతలు అప్పగించేది. కూటమి ప్రభుత్వం తిరిగి ఆదోని డివిజన్‌కు ఆర్‌డీఓనే నియమించడం గమనార్హం.
రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కా ర వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయ న ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అర్జీదారులు meekosam. ap.gov.in అనే వెబ్‌సైట్‌లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఏసీబీ డీఎస్పీకి పదోన్నతి
కర్నూలు: కర్నూలు రేంజ్ ఏసీబీ డీఎస్పీ దివిటి సోమన్నకుఅడిషనల్ ఎస్పీగా పదోన్నతి లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది డీఎస్పీలకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో భాగంగా కర్నూలు ఎసీబీ డీఎస్పీగా పనిచేస్తున్న సోమ న్నకు కూడా పదోన్నతి కల్పించి పోలీస్ హెడ్ క్వార్టర్స్ అమరావతిలో రిపోర్టు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ శనివారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం వేపకుంట గ్రామానికి చెందిన సోమన్న 1991లో ఎస్‌ఐ హోదాలో పోలీసు శాఖలో చేరి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్లలో ఎస్‌ఐగా, సీఐగా పనిచేశారు. 2020లో డీఎస్పీగా పదోన్నతి పొంది సీఐడీ, ఆదోని డీఎస్పీగా పనిచేశారు. 2025 ఏప్రిల్ 30న ఏసీబీ డీఎస్పీగా నియమితులై సుమారు 14 నెలల పాటు సేవలందించారు.
కర్నూలు: సదరన్ రీజియన్ కర్నూలు హోంగార్డ్ కమాండెంట్‌గా అమిటి హనుమంతు నియమితులయ్యారు. రాష్ట్రంలో ఇద్ద రు అడిషనల్ ఎస్పీలు, ఒక హోంగార్డు కమాండెంట్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జా రీ చేసింది. ఇందులో భాగంగా కర్నూలు సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్‌గా ఉన్న మేకల మహేష్ కుమార్‌ను తిరుపతిలోని పోలీస్ శిక్షణ కేంద్రం(పీటీసీ)కు బదిలీ చేసి.. గుంటూరు ఏఆర్ అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న హనుమంతును కర్నూలుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మదనపల్లి జిల్లా కలికిరి మండలం తెల్లగుట్టపల్లె గ్రామానికి చెందిన రా మయ్య, కృష్ణమ్మ మూడో సంతానమైన హనుమ ంతు 1991లో ఆర్‌ఎస్‌ఐ హోదాలో పోలీసు శాఖ లో చేరి హైదరాబాద్ ఇంటెలిజెన్స్ విభాగం సెక్యూరిటీ వింగ్‌లో పనిచేశారు. 1999లో ఆర్‌ఐ గా పదోన్నతి పొంది హైదరాబాద్ గ్రేహౌండ్స్, తిరుపతి విజిలెన్స్ విభాగాల్లో పనిచేశారు. 2009లో ఏఆర్ డీఎస్పీగా పదోన్నతి పొంది తిరు పతి డీఎస్పీ, తిరుమల విజిలెన్స్ విభాగాల్లో పనిచేశారు. 2020లో అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది కొంతకాలం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం గుంటూరు ఏఆర్ అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తూ కర్నూలు హోంగార్డ్స్ విభాగానికి బదిలీపై వస్తున్నారు.


