కొండపల్లి శీనును స్నేహితులే హత్య చేశారు | - | Sakshi
Sakshi News home page

కొండపల్లి శీనును స్నేహితులే హత్య చేశారు

Jul 5 2026 2:18 AM | Updated on Jul 5 2026 2:18 AM

● శవాన్నైనా అప్పగించాలని కలెక్టరేట్‌ ఎదుట కుటుంబీకుల ధర్నా

● శవాన్నైనా అప్పగించాలని కలెక్టరేట్‌ ఎదుట కుటుంబీకుల ధర్నా

కర్నూలు(సెంట్రల్‌): డ్రగ్స్‌ మత్తులో ఉన్న స్నేహితులు బేడ బుడగ జంగం కులానికి చెందిన కొండపల్లి శీనును దారుణంగా హత్య చేశారని ఏపీ బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్‌ ఆరోపించారు. జిల్లాలో విచ్చల విడి గా దొరుకుతున్న డ్రగ్స్‌, ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని ప్రభుత్వం నివారించడంలో విఫలమైందని విమ ర్శించారు. కొండపల్లి శీను శవాన్నైనా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించాలని కోరుతూ శనివారం కలెక్టరేట్‌ ఎదుట ఏపీ బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని కల్లూరు ఎస్టేట్‌లో నివాసం ఉండే బేడ బుడగ జంగం కులానికి చెందిన సుంకన్న కుమారుడు కొండపల్లి శీను జూన్‌ 27వ తేదీన స్నేహితులతో కలసి బయటకు వెళ్లారన్నారు. అయి తే వారంతా చిన్నపాటి ఘర్షణతో శీనును హత్య చేసినట్లు అనుమానం ఉందన్నారు. మొదట నాలుగో పట్టణ పోలీసులు మిస్సింగ్‌ కేసుగా నమోదు చేశారని, తరువాత పోలీసుల విచారణలో హత్యగా నిర్ధారణ అయినట్లు చెప్పారు. ఈ క్రమంలో చనిపోయిన శీను మృతదేహాన్ని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించేందుకు పోలీసులు చర్యలు తీసు కోవాలని డిమాండ్‌ చేశారు. దాదాపు వారం రోజులు గడిచిపోయినప్పటికీ శవం ఆచూకీ లేదని, విచారణను వేగవంతం చేసి నిందితులకు శిక్షపడేలా చూడాలని కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున బుడగ జంగాల కులస్తులు, శ్రీను కుటుంబీకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement