● యాదవాడలో వైఎస్సార్‌పీపీ నాయకుడి మోటార్, పైపులైన్ల ధ్వంసం
విద్యుత్ మోటార్ పైపులను ధ్వంసం చేసిన దృశ్యం, ఓవర్‌హెడ్ ట్యాంక్ సంబంధించి విద్యుత్ తీగలను కట్‌చేసిన దృశ్యం
ఆళ్లగడ్డ: చంద్రబాబు పాలనలో టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డేలేకుండా పోతుంది. వైఎస్సార్‌సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నారు. శుక్రవారం మండలంలోని యాదవాడ గ్రామంలో గ్రామ వైఎస్సార్‌సీపీ నాయకుడు నరసింహారెడ్డికి చెందిన పొలం మోటార్, పైపులైన్లను ధ్వంసం చేశారు. ముందుగా గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ప్రభుత్వ మోటార్‌ను నరసింహారెడ్డి వాడుకుంటున్నాడని అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు వచ్చిన మండల, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు బోరు ప్రభుత్వానిది కాదని తేల్చారు. దీంతో నాయకులు అక్కసుతో పొలానికి నీరు వెళ్లేందుకు వీలు లేకుండా పైపులను ధ్వంసం చేసి పైశాచిక అనందం పొందుతున్నారు. అలాగే నరసింహారెడ్డి భార్య బొల్లపు సరస్వతీ గ్రామ సర్పంచ్ కావడంతో గ్రామానికి నీటిసరఫరా చేసి ఓహెచ్‌ఆర్ వద్ద విద్యుత్ తీగలను కట్ చేశారు. దీంతో గ్రామస్తులకు తాగునీటి సరఫరా కాక ఇబ్బందులు పడ్డారు.


