జిల్లా అంతటా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా అంతటా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు

Mar 14 2026 7:32 AM | Updated on Mar 14 2026 7:32 AM

కర్నూలు: మద్యం సేవించి వాహనాలు నడపటం వల్లే ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన పోలీసు శాఖ జిల్లా అంతటా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు విస్తృతం చేసింది. జిల్లాలో నాలుగు పోలీస్‌ సబ్‌ డివిజన్లు, 39 పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. జనవరి నుంచి మార్చి 12వ తేదీ వరకు రెండున్నర నెలల్లో 1,666 మంది మద్యం సేవించి డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడినట్లు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ట్రాఫిక్‌ నిబంధనలు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా పాటించాలని, నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసి ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించవద్దని ఎస్పీ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement