భక్తి పూర్వక అడుగులు | - | Sakshi
Sakshi News home page

భక్తి పూర్వక అడుగులు

Mar 11 2026 7:53 AM | Updated on Mar 11 2026 7:53 AM

శివయ్య పిలుస్తున్నాడు..

శ్రీశైలానికి కాలినడకన వెళ్తున్న భక్తులు

ఇల కై లాసమైన శ్రీగిరి వైపు కన్నడిగుల భక్తి పూర్వక అడుగులు పడుతున్నాయి. వందల కి.మీ దూరం.. మండే ఎండలతో సెగలు కక్కే రోడ్లపై పాదయాత్రగా శివయ్య భక్తులు తరలి వస్తున్నారు. కొందరు భుజాన బసవన్న కావడీలు.. మరి కొందరు నెత్తిన మల్లన్న అపురూప ప్రతిమలు.. కాషాయ పతాకాలు చేతపట్టి.. కాళ్లకు ఎత్తైన కర్రలు కట్టుకుని నడక సాగిస్తున్నారు. దారి పొడవునా శివయ్య చిత్ర దుస్తులు ధరించిన భక్తులు భజనలు చేసుకుంటూ.. మల్లన్న పాటలు పాడుకుంటూ నల్లమల వైపు వెళ్తున్నారు. కర్ణాటక ప్రాంత భక్తులు శ్రీశైలంలో జరిగే ఉగాది ఉత్సవాలకు భారీగా పాదయాత్రగా తరలివెళ్తున్నారు. కర్నూలు – ఆత్మకూరు రహదారి వెంట కన్నడిగులు వరుస కట్టి వడివడిగా అడుగులు వేస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, కర్నూలు

హనుమాన్‌ జెండా

పట్టుకొని..

శివయ్యపై భక్తితో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement