ఎమ్మిగనూరు టౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం క్వింటా వేరుశనగ ధర గరిష్టంగా రూ.8,550 పలికింది. 3,075 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడులను రైతులు మార్కెట్‌లో విక్రయానికి తెచ్చినట్లు మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి.చంద్రమౌళి తెలిపారు. కనిష్ట ధర క్వింటా రూ.3,891, మధ్యస్థ ధర రూ.7,780 పలికిందన్నారు.
● ఆముదాలు 8 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ట ధర క్వింటా రూ.5,611, మధ్యస్థ ధర క్వింటా రూ.5,763, గరిష్ట ధర రూ.5,774 నమోదైందన్నారు.
● కందులు 8క్వింటాళ్లు విక్రయానికి రాగా క్వింటా కనిష్ట ధర రూ.4,212, మద్యస్థ ధర రూ.6,420, గరిష్ట ధర రూ.7,011.. మినుములు 8 క్వింటాళ్లు విక్రయానికి రాగా క్వింటా రూ.6,670 గరిష్ట ధర పలికిందన్నారు.


