కర్నూలు(అర్బన్): మహిళల పనుల్లో పురుషుల భాగస్వామ్యాన్ని పెంచి మహిళా సాధికారతకు దోహదపడాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పి.విజయ కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో రోజు ఒక్కో వినూత్న కార్యక్రమాన్ని తమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 10వ రోజు మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఐసీడీఎస్ కార్యాలయంలో మెన్ కుకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పురుషులు వంట వండటం వినూత్నంగా, ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో డీసీపీఓ టి.శారద, సీనియర్ సహాయకులు సురేష్‌రెడ్డి, సతీష్, ఈఓ రాజేశ్వరి, డీసీ బాలు, వన్‌స్టాప్ సెంటర్ మేరీ స్వర్ణలత, జూనియర్ సహాయకులు గణేష్ తదితరులు పాల్గొన్నారు.


