హెల్త్‌ సెక్రటరీలకు పనిభారం తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

హెల్త్‌ సెక్రటరీలకు పనిభారం తగ్గించాలి

Mar 10 2026 12:50 PM | Updated on Mar 10 2026 12:50 PM

కర్నూలు(హాస్పిటల్‌): గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే హెల్త్‌ సెక్రటరీలకు పనిభారం తగ్గించాలని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ హెల్త్‌ సెక్రటరీ అసోసియేషన్‌(సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి సంధ్యారాణి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, జిల్లా ప్రధాన కార్యదర్శులు పీఎస్‌. రాధాకృష్ణ, ఎండీ అంజిబాబు, శ్రామిక మహిళా రాష్ట్ర నాయకులు పి.నిర్మల డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద హెల్త్‌ సెక్రటరీలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాప్‌ల పనిభారం తగ్గించాలని, ప్రమోషన్లు కల్పించాలని, జీవో నెం.124ను అమలు చేయాలని కోరారు. మదర్‌ డిపార్ట్‌మెంట్‌ అయిన మెడికల్‌ అండ్‌ హెల్త్‌కు హెల్త్‌ సెక్రటరీలను బదలాయించాలని డిమాండ్‌ చేశారు. కర్నూలు నగరంలో హెల్త్‌ సెక్రటరీలకు ఇంక్రిమెంట్‌ అమలు జరిగే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే, పీ–4 సర్వే, మున్సిపల్‌ తదితర సర్వేలపై సర్వే పేరుతో సతమతమవుతున్నారని, వారిని మారుమూల గ్రామాలకు రాత్రి 10 గంటల వరకు తిప్పుతున్నారని మండిపడ్డారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ ఏఓ అరుణకు వారు వినతి పత్రం సమర్పించారు. సీఐటీయూ న్యూసిటీ కమిటీ అధ్యక్షులు వై.నాగేష్‌, హెల్త్‌ సెక్రటరి యూనియన్‌ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు మహేశ్వరి, నంద్యాల జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరమ్మ, మాధవి, శంషాద్‌, సుజాత, రాధాబాయి, నాగమణి, రజని, వరలక్ష్మిదేవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement