ఘనంగా సుయతీంద్రతీర్థుల ఉత్తరారాధన | - | Sakshi
Sakshi News home page

ఘనంగా సుయతీంద్రతీర్థుల ఉత్తరారాధన

Mar 10 2026 12:49 PM | Updated on Mar 10 2026 12:49 PM

మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠం పూర్వపు పీఠాధిపతి సుయతీంద్రతీర్థులు ఉత్తరాధన వేడుకలు సోమవారం వైభవంగా సాగాయి. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో ఉత్సవాలను కనుల పండువగా నిర్వహించారు. ముందుగా వేద పఠనంతో సుయతీంద్ర తీర్థుల మూల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం చేశారు. అనంతరం అలంకరణలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. గురుసార్వభౌమ సంస్కృత విద్యాపీఠానికి చెందిన నలుగురు విద్యార్థులు సుబుధేంద్రతీర్థుల సన్నిధిలో రుగ్వేద సంహిత మంగళాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. వేద పాఠశాల విద్యార్థులను ఫల మంత్రాక్షితలతో శ్రీమఠం పీఠాధిపతి ఆశీర్వదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement