ఆడ పిల్లలను చదివించాలి | - | Sakshi
Sakshi News home page

ఆడ పిల్లలను చదివించాలి

Mar 9 2026 7:35 AM | Updated on Mar 9 2026 7:35 AM

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి

కర్నూలు(సెంట్రల్‌): మహిళా శక్తి అపారమని, ఆడ పిల్లలను చదివిస్తే జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారని జిలా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి పేర్కొన్నారు. తాను మహిళగా పుట్టినందుకు గర్వ పడుతున్నానని, అనేక ఆటుపోటులను ఎదుర్కొని ధైర్యంగా ముందుకెళ్తున్నానని చెప్పారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఆదివారం ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో బాల్య వివాహాలతో ఆడపిల్లల చదువును మధ్యలోనే ఆపి వేయించడం తదన్నారు. తాను కలెక్టర్‌గా వచ్చిన తరువాత 8 నెలల కాలంలో 83 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు చెప్పారు. వారందరినీ ప్రత్యేకంగా క్యాంపుల్లో ఉంచి చదివిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో సీ్త్రల అక్షరాస్యత 57 శాతంగా ఉందన్నారు. అనంతరం జేసీ నూరుల్‌ ఖమర్‌ మాట్లాడుతూ.. పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారన్నారు. డీఆర్‌డీఏ మెప్మా ద్వారా వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందిన 60.02 లక్షల మంది మహిళలకు మెగా చెక్‌ను అందించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ సి.వెంకట నారాయణమ్మ, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఓర్వకల్లు పొదుపు ఐక్య సంఘం అధినేత విజయభారతి, డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి పాల్గొన్నారు.

ఆమెకు ఏ హోదా ఉంది...

అంతర్జాతీయ మహిళా దినోత్సవాలకు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అధికారికంగా హాజరు కావడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఆమెకు ఏ హోదా ఉందని అధికారులు ఆహ్వానించారని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు అయితే ఇతర పార్టీల మహిళా నాయకురాళ్లను ఎందుకు ఆహ్వానించలేదని ఐద్వా, ఏపీ మహిళా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement