● స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ
ఎంప్లాయీస్ అసోసియేషన్
నూతన కమిటీలు ఏర్పాటు
కర్నూలు(సెంట్రల్): కర్నూలు, నంద్యాల జిల్లాల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఎంప్లాయీస్ అసోసియేషన్లు ఏకగీవ్రంగా ఎన్నికయ్యాయి. ఆదివారం కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రెండు జిల్లాలకు చెందిన ఉద్యోగులు హాజరై నూతన కమిటీలను ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర కమిటీ సభ్యులు బాల సుబ్రమణ్యం, ఎస్ మహబూబ్‌బాషా (డోన్), ఫైరోజ్ (ఓర్వకల్) వ్యవహరించారు.
కర్నూలు జిల్లా కమిటీ..
కర్నూలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడిగా కె.శ్రీనివాసరావు (కర్నూలు సబ్ రిజిస్ట్రార్) జిల్లా అధ్యక్షుడిగా ఎంయూ మురళీ సుందరరావు, ఉపాధ్యక్షులుగా డీ లలితకుమారి, ప్రధాన కార్యదర్శిగా జే ప్రవీణ్‌కుమార్, జాయింట్ సెక్రటరీగా బీ భవానీ, ట్రెజరర్‌గా టీ ఈశ్వరయ్య, ఈసీ మెంబర్లుగా ఫైరోజ్, బీ కర్ణ, మూర్తికుమార్, ఉదయ్‌కుమార్, అనిత, ఎన్ రాధను ఎన్నుకున్నారు.
నంద్యాల జిల్లా కమిటీ..
నంద్యాల జిల్లా గౌరవాధ్యక్షుడిగా ఎస్ మహబూబ్‌బాషా (డోన్), జిల్లా అధ్యక్షుడిగా కే శివకుమార్, ఉపాధ్యక్షులుగా ఎం.ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శిగా కే అబ్దుల్‌కరీం, జాయింట్ సెక్రటరీగా కే మంజుల, ట్రెజరరీగా ఎం.హుజిమియ్యా, ఈసీ మెంబర్లుగా జే వీఎన్‌రాజు, ఎన్. మధుబాబు, బీ వసంత, ఎం రాముడు, ఎన్ నీలమ్మ, ఎల్,వీరన్న, పీ జయవాణిని ఎన్నుకున్నారు.


