ఓబులాపురం వద్ద 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.32 కోట్లతో నిర్మించతలపెట్టిన అంబేడ్కర్ గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనుల టెండర్‌ను టీడీపీ నేతలు రద్దు చేయించారు. అలాగే ప్యాపిలి శివారులో 100 ఎకరాల విస్తీర్ణంలో మంజూరైన ఇంటిగ్రెటెడ్ మార్కెట్ పనులను నిలిపివేశారు. మెట్టుపల్లి వద్ద నిర్మించతలపెట్టిన టమాట జ్యూస్ ఫ్యాక్టరీని పట్టించుకోలేదు. వెంగళాంపల్లె, అబ్బిరెడ్డి పల్లె చెరువుల వద్ద టూరిస్ట్ బోటు కలగా మిగిలింది. డోన్ నియోజకవర్గంలో ఏడు పార్కుల అభివృద్ధి పనులను నిలిపివేశారు. హార్టికల్చర్, అగ్రికల్చర్ కళాశాల నిర్మాణ పనులను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. రూ.4 లక్షల లీటర్ల నీటి కేపాసిటి గల ఓవర్ హెడ్ ట్యాంక్ పనులను నిలిపివేశారు.


