● కలెక్టరేట్ ఎదుట
విలేజ్ సర్వేయర్ల ఆందోళన
● డిమాండ్లను పరిష్కరించకపోతే
రీసర్వేను నిలిపేస్తామని హెచ్చరిక
కర్నూలు(సెంట్రల్): గ్రామ విలేజ్ సర్వేయర్ల పదోన్నతులు, కనీస పేస్కేళ్ల నిర్ధారణపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఏపీ విలేజ్ సర్వేయర్ల సంఘం హెచ్చరింది. తమ డిమాండ్ల సాధనకు అవసరమైతే రీసర్వేను బహిష్కరిస్తామన్నారు. శనివారం ఆ సంఘం ఆధ్వర్యంలో వందలాది విలేజ్ సర్వేయర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వహించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ట్రెజరర్ ఓంకార్ మాట్లాడుతూ అధికారికంగా శనివారం నుంచి విలేజ్ సర్వేయర్లు వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలగనున్నట్లు చెప్పారు. సోమవారం విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామరు. 5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న విలేజ్ సర్వేయర్లకు గ్రేడ్–1 పదోన్నతితో పాటు పే స్కూలును కనీసం రూ.34,580 నిర్ణయించాలనే డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. అడహాక్ పద్ధతిలో మండల డిప్యూటీ సర్వేయర్ పదోన్నతి కల్పిస్తే రీసర్వేలో ప్రధాన భూమికను పోషిస్తామన్నారు. గ్రామ సర్వేయర్ కనీస విద్యార్హత డిప్లమోగా సవరించాలని, రీసర్వేలో క్యూజీఐఎస్, సీఓఆర్‌ఎస్, ఆటో సీఏడీ వంటి సాంకేతిక నైపుణ్యాలు ఉన్న గ్రామ సర్వేయర్లను టెక్నికల్ రోల్ కింద గుర్తించి ప్రత్యేక పేస్కేలు అమలు చేయాలన్నారు. 5 సంవత్సరాలుగా పైస్థాయి నుంచి మండల స్థాయి సర్వేయర్ పోస్టుకు వరకు పదోన్నతులు వస్తున్నాయని, అయితే విలేజ్ సర్వేయర్ పోస్టులకు స్పెషల్ గ్రేడ్ సర్వేయర్స్, గ్రేడు–2 నుంచి గ్రేడు–1 సర్వేయర్ పదోన్నతులు రావడంలేదన్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరూ చెప్పకపోవడంతో రీసర్వేను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. అనంతరం డీఆర్వో వెంకటనారాయణమ్మకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గోపాలకృష్ణ, మనోజ్‌కుమార్, వీ.రఘుదీప్, వంశీ, మహబూబ్‌బాషా పాల్గొన్నారు.


