కన్నడిగుల పాదయాత్ర భక్తులు శ్రీశైలం వైపు అడుగులు వేస్తున్నారు. కొందరు కావడి మోస్తూ.. మరి కొందరు కర్ర కాళ్లపై నడుస్తూ, భజనలు చేసుకుంటూ శ్రీశైలం చేరుకుంటుండగా ఓ భక్తుడు సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ మల్లన్న దర్శనానికి వెళ్తున్నాడు. కర్ణాటక రాష్ట్రం భాగల్‌కోటి జిల్లా కొనురోల్ గ్రామానికి చెందిన గుర్రప్ప అతని సతీమణి మల్లమ్మ, అదే గ్రామానికి చెందిన వెంకయ్యతో కలిసి 15 రోజుల క్రితం బయలుదేరాడు. 20 అడుగులకు ఒకసారి చొప్పున సాష్టాంగ నమస్కారం చేస్తూ శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామిఅమ్మవార్లకు మొక్కు చెల్లిస్తున్నాడు. వాహనదారులు, ప్రజలు అతని భక్తిని చూసి నివ్వెరపోతున్నారు. – ఆత్మకూరు


