మల్లయ్య ఉత్సవ విగ్రహాల పల్లకీతో శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న కర్ణాటక భక్తులు
శ్రీశైల క్షేత్రంలో నిర్వహించే ఉగాది ఉత్సవాల్లో పాల్గొనేందుకు కన్నడిగుల దండు కదిలింది. బళ్లారి జిల్లా శిరిగేరి, బాద్నట్టి, వద్దట్టి, కుడితిని, మణుసుగూరు, గెణికాళ్, సిద్దమ్మనళ్లి, కొంచిగేరి, బలకుంది తదితర గ్రామాల నుంచి భక్తులు హొళగుంద మీదుగా శ్రీశైలం వైపు పాదయాత్రగా తరలివస్తున్నారు. మల్లయ్య ఉత్సవ విగ్రహాలు కొలువైన పల్లకీని మోసుకుని శివ నామస్మరణతో ముందుకు కదులుతున్నారు. వీరికి హొళగుంద, సమ్మతగేరి, పెద్దహ్యాట, చిన్నహ్యాట, ఎల్లార్తి తదితర గ్రామస్తులు అల్పాహారం, భోజనంతో పాటు అరటి పండ్లు, మజ్జిగ ఇతర శీతల పానీయాలు అందజేశారు. అలాగే మార్లమడికి రోడ్డులో హొళగుందకు చెందిన వారు ఉదయం అల్పాహారంతో పాటు ఆరోగ్య సమస్యలు భక్తులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
– హొళగుంద


