● జిల్లా కలెక్టర్‌కు
ఏపీ ఎన్‌జీజీవోస్ నేతల వినతి
కర్నూలు(అగ్రికల్చర్): ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీఎన్‌జీజీవోస్ అసోసియేషన్ కర్నూలు శాఖ అధ్యక్షుడు జవహార్‌లాల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరిని కోరారు. శుక్రవారం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జవహార్‌లాల్, ఎంసీ కాశన్న ఆధ్వర్యంలో పలువురు నేతలు జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఏపీ ఎన్‌జీజీవోస్ అసోిసి యేషన్ 2026 డైరీని కలెక్టర్ చేతుల మీదుగా విడుదల చేశారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కలెక్టర్ దృష్టికి వివిధ సమస్యలను తీసుకెళ్లారు. వైద్య ఆరోగ్య శాఖలో అర్బన్ సచివాలయాల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలకు 2025 జూలై నుంచి వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేయడం లేదని, తగిన చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎంప్లాయీస్ వెల్పేర్ నిధి సమావేశాలు కొన్ని నెలలుగా నిర్వహించకపోవడంతో ఉద్యోగులకు రుణాల మంజూరులో జాప్యం జరుగుతోందన్నారు. జిల్లా ట్రైనింగ్ సెంటరును పునః ప్రారంభించి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కారు ణ్య నియామకాల్లో జాప్యం లేకుండా చూడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ కాశన్నతో పాటు సహాధ్యక్షులు ఈశ్వరయ్య, ఇతర జిల్లా నాయకులు భాస్కరనాయుడు, ఆర్‌వీ రమణ, కేసీహెచ్ కృష్ణుడు, నాగకిశోర్, కర్నూలు నగరశాఖ అధ్యక్షుడు రామకృష్ణ, వ్యవసాయ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి మహేందర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


