ఎకై ్సజ్‌ నేరాల అదుపునకు కృషి | - | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌ నేరాల అదుపునకు కృషి

Mar 7 2026 7:27 AM | Updated on Mar 7 2026 7:27 AM

పత్తికొండ: ఎకై ్సజ్‌ శాఖ పరిధిలో నేరాల అదుపునకు అధికారులు ప్రత్యేక కృషి చేయాలని ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీదేవి సూచించారు. శుక్రవారం పత్తికొండ పట్టణంలో ఎకై ్సజ్‌ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలన చేశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నవో దయం పథకంలో భాగంగా ప్రత్యేకించి గిరిజన గ్రామాల్లో నాటుసారా అమ్మకాలను పూర్తిగా అదుపులోకి తీసుకురావాలని సూచించారు. గిరిజనులకు ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తూ వారిలో మార్పులు తీసుకురావడానికి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా పత్తికొండ ఎకై ్సజ్‌ శాఖ సబ్‌ డివిజన్‌లో ఎకై ్సజ్‌ నేరాల అదుపు కోసం సిబ్బంది ప్రత్యేక కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్‌లు రాజశ్రీ, హనుమంతురావు, ఎకై ్సజ్‌ సీఐ సువర్ణలత, ఎస్‌ఐలు ప్రవీణ్‌నాయక్‌, రాజేష్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement