కర్నూలు: మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ జిల్లా అంతటా పాఠశాలలు, కళాశాలల్లో సినిమాలు, వీడియోల ప్రదర్శన చేపట్టారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు శాఖ ఈనెల 1 నుంచి జిల్లా అంతటా వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గురువారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా పీఎస్ సీఐ విజయలక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో వీడియోల ప్రదర్శన జరిగింది. సమాజంలో మహిళలకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని, ఆపద సమయంలో పోలీసుల సహాయం తీసుకోవాలని సూచిస్తూ అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా కర్నూలు నగరం లేబర్ కాలనీలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శక్తి యాప్ వినియోగంపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో శక్తి వాట్స ప్ నెంబర్ 7993485111కు కాల్ చేసినా, మెసేజ్ చేసి నా పోలీసులు స్పందించి అవసరమైన చర్యలు చేపడతారని తెలిపారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ శక్తి టీమ్ సభ్యులు హెడ్ కానిస్టేబుళ్లు మహబూబ్ ఖాన్, ఎస్‌ఎం బాషా, వన్‌స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ మేరీ స్వర్ణలత, జ్యోత్స్న, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


