చాగలమర్రి: ఎడ్ల బండలాగుడు పోటీల్లో వైఎస్సార్ జిల్లా చెన్నూరు గ్రామానికి చెందిన గుమ్మల్ల సాయికుమార్‌రెడ్డి ఎద్దులు ప్రథమ స్థానంలో నిలిచాయి. పెద్దవంగలి గ్రామంలో దస్తగిరి స్వామి ఉరుసు సందర్భంగా సోమవారం ఈ పోటీలు నిర్వహించారు. పోటీలను దర్గా కమిటీ చైర్మన్ ముల్లా రబ్బానీ ప్రారంభించారు. వైఎస్సార్ జిల్లా చెన్నూరు గ్రామానికి చెందిన గుమ్మల్ల సాయికుమార్‌రెడ్డి ఎద్దులు మొదటి స్థానంలో నిలిచి రూ.30,116 నగదును దక్కించుకున్నాయి. అలాగే ద్వితీయ స్థానంలో నిలిచిన అనంతపురం జిల్లా క్రిష్ణాపురం గ్రామానికి చెందిన సాకే పృథ్వీరాజు ఎద్దులు రూ.20,116 అందజేశారు.


