మహిళా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం
కర్నూలు: అంతర్జాతీయ మహిళ దినోత్సవం మార్చి 8ని పురస్కరించుకొని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం కొండారెడ్డిబురుజు వద్ద అడిషనల్ ఎస్పీ హుసేన్‌పీరా జెండా ఊపీ ర్యాలీని ప్రారంభించారు. మహిళలు, విద్యార్థులు, చిన్నారులు సాధికారిత కల్పించే ఉద్దేశంతో మహిళ పోలీసు విభాగం ఆధ్వర్యంలో ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. కొండారెడ్డి బురుజు నుంచి ప్రారంభమైన ర్యాలీ కోల్స్ కళాశాల మీదుగా పాత కంట్రోల్ రూము వరకు, అక్కడి నుంచి తిరిగి జిల్లా పోలీసు కార్యాలయం వరకు సాగింది. ఒంటరిగా ప్రయాణిస్తున్నారా...శక్తి యాప్ ఉపయోగించండి అనే నినాదాలతో ప్లకార్డులు పట్టుకొని వివిధ కళాశాలల విద్యార్థులు, మహిళా పోలీసులు పాల్గొన్నారు. వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలతో పాటు పెయింటింగ్, డ్రాయింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, హెల్త్ క్యాంపులు, ఓపెన్ హౌస్, సాంస్కృతిక కార్యక్రమాలు, బ్యాండ్‌షోలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేస్తామని ఏఎస్పీ తెలిపారు. ఏఆర్ ఆడిషినల్ ఎస్పీ కృష్ణమోహన్, సీఐలు రామయ్యనాయుడు, విజయలక్ష్మి, పార్థసారథి, నాగరాజరావు, మన్సూరుద్దీన్, ఆర్‌ఐలు నారాయణ, జావీద్, ఆర్‌ఎస్‌ఐలు శక్తిటీమ్ మహిళా పో లీసులు, సచివాలయ పోలీసులు, శ్రీలక్ష్మి, చైతన్య, కేవీఆర్ కళాశాల, సిరాక్ స్కూల్ విద్యార్థుఽలు ర్యాలీలో పాల్గొన్నారు.


