ఎస్టీ రిజర్వేషన్‌తోనే వాల్మీకుల అభ్యున్నతి
కర్నూలు(అర్బన్): వాల్మీకుల జీవితాల్లో వెలుగులు నిండడంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఎస్టీ రిజర్వేషన్‌తోనే సాధ్యమని పలువురు వాల్మీకి నేతలు అన్నారు. కార్తీక మాసం పురస్కరించుకొని బుధవారం నగర శివారు వెంకాయపల్లె ఎల్లమ్మ దేవాలయం సమీపంలోని శ్రీనివాస గార్డెన్స్‌లో వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉసిరి చెట్టుకు, వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. పత్తికొండ డీఎస్పీ బోయగడ్డ వెంకటరామయ్య, వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ, రామచంద్రనాయుడు, వనభోజన కమిటీ సభ్యులు బేతం కృష్ణుడు, సత్రం రామకృష్ణుడు, తలారి కృష్ణనాయుడు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.


