భారీగా కర్ణాటక మద్యం పట్టివేత
కర్నూలు: గోనెగండ్ల మండలం బోదెపాడు గ్రామంలో భారీ ఎత్తున కర్ణాటక మద్యం పట్టుబడింది. వ్యవసాయ పొలంలో అదే గ్రామానికి చెందిన బోయ మహేష్ అక్రమంగా నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో నిఘా వేసి పట్టుకున్నారు. బోయ మహేష్ తన ఇంటి వెనుక ఉన్న వ్యవసాయ భూమిలో 21 బాక్సుల్లో 2014 మద్యం బాటిళ్లను నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతుండగా ఈఎస్‌టీఎఫ్ ఏఈఎస్ రామకృష్ణారెడ్డి, సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బనగానపల్లె మండలం కై ప గ్రామానికి చెందిన తలారి కృష్ణ కర్ణాటక నుంచి మహేష్‌కు మద్యం సరఫరా చేస్తున్నట్లు విచారణలో బయట పడింది. ఇరువురిపై కేసు నమోదు చేశారు. మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సరఫరాదారుడు తలారి కృష్ణ కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీల్లో సిబ్బంది రామచంద్ర, శాంతిరాజ్, అయ్యన్న పాల్గొన్నారు.


