సాధారణంగా ఏ ప్రభుత్వం ఉన్నా.. గత ప్రభుత్వం చేపట్టిన మంచి పనులను కొనసాగించాలి. అయితే, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన మంచి కనిపించకూడదనే ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పలు కార్యక్రమాలను ప్రస్తుత చంద్రబాబు సర్కారు నీరుగారుస్త | - | Sakshi
Sakshi News home page

సాధారణంగా ఏ ప్రభుత్వం ఉన్నా.. గత ప్రభుత్వం చేపట్టిన మంచి పనులను కొనసాగించాలి. అయితే, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన మంచి కనిపించకూడదనే ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పలు కార్యక్రమాలను ప్రస్తుత చంద్రబాబు సర్కారు నీరుగారుస్త

Nov 18 2025 6:01 AM | Updated on Nov 18 2025 6:01 AM

సాధార

సాధారణంగా ఏ ప్రభుత్వం ఉన్నా.. గత ప్రభుత్వం చేపట్టిన మంచ

రూ.3 లక్షలు పెట్టుబడి పెడితే ఒక్క రూపాయీ దక్కలేదు ఈఎంఐలు చెల్లించలేక వెనక్కు ఇచ్చేశాం

అటకెక్కిన సోలార్‌ డ్రయ్యర్లు

ఈ ఏడాది ఖరీఫ్‌లో 3.50 ఎకరాల్లో ఉల్లి సాగు చేశాం. ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాం. కూటమి ప్రభుత్వం మొదట్లో ప్రకటించిన రూ.1,200 మద్దతు ధర ఉంటే కొంత ఉపశమనం లభించేది. ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసి ఎకరాకు రూ.20 వేల పరిహారం చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో కోత, రవాణా చార్జీలు కూడా గిట్టుబాటు కాని పరిస్థితి. విధిలేక మొత్తం పంటను ట్రాక్టరుతో టిల్లర్‌ కొట్టించాం. రూ.3 లక్షలు పెట్టుబడి పెడితే ఒక్క రూపాయి కూడా దక్కలేదు.

– కె.నాగరాజు, పెద్దహుల్తి, పత్తికొండ మండలం

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సోలార్‌ డ్రయ్యర్లు జీవనోపాధికి ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రతి నెలా ఈఎంఐ చెల్లింపులు పోను రూ.18వేల నుంచి రూ.20వేల వరకు ఆదాయం ఉండేది. 2024 మే నెల నుంచి సోలార్‌ డ్రయ్యర్లకు టమాట/ఉల్లి సరఫరా ఆగిపోయింది. నెలవారీ ఈఎంఐలు చెల్లించడం భారంగా మారడంతో కంపెనీకి సోలార్‌ డ్రయ్యర్లను వెనక్కి ఇచ్చేశాం. టీడీపీ ప్రభుత్వం చొరవ తీసుకొని ధరలు తగ్గినప్పుడు ఉల్లి/టమాట సరఫరా చేస్తే మహిళలకు ఉపాధి లభిస్తుంది.

– అంజుమ్‌, పెద్దనెలటూరు, గోనెగండ్ల మండలం

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉల్లి ప్రధాన వాణిజ్య పంట. రాష్ట్రంలో సాగయ్యే ఉల్లిలో 90 శాతం కర్నూలు జిల్లాలోనే ఉంది. ఇక్కడ పండించిన ఉల్లి ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, ఆగ్రా తదితర ప్రాంతాలకు తరలిస్తారు. అక్కడి నుంచి ప్రధానంగా బంగ్లాదేశ్‌, పలు అరబ్‌ దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇలా జాతీయ, అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందిన ఉల్లి ధర పడిపోవడం ఏటా జరిగేదే. ఈ పరిస్థితిని అధిగమించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒకవైపు ఉల్లి రైతులకు ఉపశమనం కల్పించడం, మరోవైపు స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా పెద్దఎత్తున సోలార్‌ డ్రయ్యర్లను ఏర్పాటుచేసింది. ఉల్లి ధరలు పూర్తిగా పడిపోయినప్పుడు తక్కువ నాణ్యత ఉన్న ఉల్లిని ఎస్‌4ఎస్‌ కంపెనీ రైతుల నుంచి కొనుగోలు చేసి రోజుకు 1,200 క్వింటాళ్ల ఉల్లి సోలార్‌ రడ్రయ్యర్లకు సరఫరా చేసేది. పొదుపు మహిళలు ఇళ్లలోనే ఉల్లి గడ్డలు కట్‌చేసి ఫ్లేక్స్‌ తయారుచేసేవారు. వీటిని ఆ కంపెనీ మళ్లీ సేకరించి వివిధ దేశాలకు ఎగుమతి చేసేది. ఇందుకు ఒక్కో మహిళకు రోజూ రూ.800 వరకు ఆదాయం లభించేది. ఇలా వైఎస్సార్‌సీపీ పాలనలో సోలార్‌ డ్రయ్యర్ల ద్వారా ఇటు రైతులకు, అటు పొదుపు మహిళలకు ఎంతో మేలు జరిగింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చొరవతో జిల్లాలో వందలాది మహిళలు జీవనోపాధి పొందారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక ఉల్లి రైతుల గోడును పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. జీవనోపాధి లేక పొదుపు మహిళలు రోడ్డున పడ్డారు. నేడు కొనేవారు లేక ఉల్లిగడ్డలను రైతులు పారబోస్తున్న ఘటనలు కోకొల్లలు.

కొత్తవి లేవు.. ఉన్నవి మూత..

ఇక రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక 15 నెలల కాలంలో ఒక్క సోలార్‌ డ్రయ్యర్‌ను కూడా ఏర్పాటుచేయకపోగా.. ఉన్నవి మూతపడేలా చేస్తోంది. గత ప్రభుత్వం ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ ఏర్పాటు చేసింది. దీనిద్వారా ఉమ్మడి జిల్లాలో దాదాపు 300 సోలార్‌ డ్రయ్యర్లు ఏర్పాటయ్యాయి. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక 228 సోలార్‌ డ్రయ్యర్లను పక్కన పెట్టేశారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోనే దాదాపు 50 సోలార్‌ డ్రయ్యర్లు మూతపడ్డాయి.

15 నెలల్లోనే రోడ్డున పడిన మహిళలు..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కృషితో ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ ద్వారా కల్లూరు మండలం తడకనపల్లిలో భారీగా సోలార్‌ డ్రయ్యర్లు భారీగా ఏర్పాటయ్యాయి. ఈ ఒక్క గ్రామంలోనే 120 ఏర్పాటయ్యాయి. ఇందులో సగం నేడు మూలనపడ్డాయి. నగర పంచాయతీ అయిన గూడూరులో 20 వరకు ఏర్పాటయ్యాయి. ఇక్కడ కూడా 12 మూలనపడిపోయాయి. నేడు తడకనపల్లిలో 60, గూడూరులో ఆరు సోలార్‌ డ్రయ్యర్లు మాత్రమే అప్పుడప్పుడు పనిచేస్తున్నాయి. బేతంచెర్లలో కూడా ఏర్పాటైనప్పటికీ నేడు ఒక్కటీ లేకుండాపోయింది. సోలార్‌ డ్రయ్యర్లను సద్వినియోగం చేసుకుని ఉపాధిని మెరుగుపరుచుకోవాలనే ఆసక్తి మహిళలకు ఉన్నప్పటికీ వారికి చేతినిండా పనికల్పించడంలో అటు ప్రభుత్వం, ఇటు జిల్లా యంత్రాంగం శ్రద్ధచూపడంలేదు. దీంతో చంద్రబాబు సర్కారు వచ్చిన 15 నెలల్లోనే మహిళలు ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారు.

సోలార్‌ డ్రయ్యర్ల ద్వారా ఉల్లి ఫ్లేక్స్‌ తయారీ

పత్తికొండ మండలం పెద్దహుల్తిలో ఉల్లి పంటను వదిలేసిన రైతులు

టీడీపీ సర్కారు నిర్వాకంతో

ఉల్లి రైతులు, మహిళలకు దెబ్బ

ధరలు పడిపోయినప్పుడు

వీటి ద్వారా చేయూత

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో

300 పైగా సోలార్‌ డ్రయ్యర్లు ఏర్పాటు

ఉల్లి ఫ్లేక్స్‌ తయారీ..

ఆ తర్వాత విదేశాలకు ఎగుమతి

ఇలా రోజుకు 1,200 క్వింటాళ్ల వరకు

ఉల్లి వినియోగం

చంద్రబాబు ప్రభుత్వంలో మనుగడ

కోల్పోయిన సోలార్‌ డ్రయ్యర్లు

ప్రస్తుతం మిగిలింది

72 యూనిట్‌లు మాత్రమే

సాధారణంగా ఏ ప్రభుత్వం ఉన్నా.. గత ప్రభుత్వం చేపట్టిన మంచ1
1/4

సాధారణంగా ఏ ప్రభుత్వం ఉన్నా.. గత ప్రభుత్వం చేపట్టిన మంచ

సాధారణంగా ఏ ప్రభుత్వం ఉన్నా.. గత ప్రభుత్వం చేపట్టిన మంచ2
2/4

సాధారణంగా ఏ ప్రభుత్వం ఉన్నా.. గత ప్రభుత్వం చేపట్టిన మంచ

సాధారణంగా ఏ ప్రభుత్వం ఉన్నా.. గత ప్రభుత్వం చేపట్టిన మంచ3
3/4

సాధారణంగా ఏ ప్రభుత్వం ఉన్నా.. గత ప్రభుత్వం చేపట్టిన మంచ

సాధారణంగా ఏ ప్రభుత్వం ఉన్నా.. గత ప్రభుత్వం చేపట్టిన మంచ4
4/4

సాధారణంగా ఏ ప్రభుత్వం ఉన్నా.. గత ప్రభుత్వం చేపట్టిన మంచ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement