20 శాతం మంది మూర్ఛరోగులే...!
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని న్యూరాలజి విభాగానికి వచ్చే రోగుల్లో 20 శాతానికి పైగా మూర్చరోగులే ఉంటున్నారు. తాము ప్రతి వారం దాదాపు వంద మంది మూర్చవ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నాము. అవసరమైన వారికి ఈఈజీ, సీటీస్కాన్, ఎంఆర్‌ఐ పరీక్షలు చేయించి ఎందువల్ల ఈ వ్యాధి వచ్చిందో గుర్తించి చికిత్స చేస్తున్నాము. ఇక్కడ చికిత్సతోపాటు అన్ని రకాల పరీక్షలు కూడా ఉచితంగా రోగులకు అందిస్తున్నాము.
–డాక్టర్ సి. శ్రీనివాసులు,
న్యూరాలజి విభాగాధిపతి, పెద్దాసుపత్రి
ఈ వ్యాధికి ఆడ, మగా తేడా లేదు. వయస్సుతో సంబంధం లేదు. సున్నా నుంచి 90 ఏళ్ల వయస్సు వారి వరకు ఈ వ్యాధి రావచ్చు. కొందరికి పుట్టుకతో వస్తే, మరికొందరికి ప్రమాదాలు, ఇన్‌ఫెక్షన్లు, ట్యూమర్ల వల్ల వస్తుంది. చిన్నపిల్లల్లో పలు కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుంది. అది ఎందువల్ల వచ్చిందో వైద్యులు నిర్ధారించి చికిత్స చేస్తారు. కొందరు మాత్రమే దీర్ఘకాలం మందులు వాడాల్సి ఉంటుంది. అధిక శాతం వైద్యుల పర్యవేక్షణలో కొంతకాలం మందులు వాడితే సరిపోతుంది.
– డాక్టర్ బి.హైందవకుమార్‌రెడ్డి,
న్యూరోఫిజీషియన్, కర్నూలు
20 శాతం మంది మూర్ఛరోగులే...!


