గ్రంథాలయ ఉద్యమ నాయకుల సేవలు చిరస్మరణీయం
కర్నూలు కల్చరల్: గ్రంథాలయ ఉద్యమ నాయకుల సేవలు చిరస్మరణీయమని వక్తలు అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో మూడో రోజు ఆదివారం గ్రంథాలయ ఉద్యమ నాయకులను స్మరించుకునే కార్యక్రమం నిర్వహించా రు. గ్రంథాలయ ఉద్యమ నాయకులు గాడిచర్ల హరిసర్వోత్తమరావు, అయ్యంకి వెంకట రమణ య్య, పాతూరి నాగభూషణం, ముచ్చుకోట చంద్రశేఖర్ చిత్ర పటాలకు డిప్యూటీ కలెక్టర్ ప్రసన్న లక్ష్మి, ఆర్‌అండ్‌బీ డీఈ పి.ప్రేమకుమారి, సైనిక్ వెల్ఫేర్ అధికారి ఎస్‌ఆర్ రత్న రూత్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం పుస్తక పఠంతో మేదస్సు పెరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శన అలరించింది. జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ ఇన్‌చార్జ్ సెక్రటరీ పెద్దక్క అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసిస్టెంట్ లైబ్రేరియన్లు వజ్రాల గోవిందరెడ్డి, బాషా, చంద్రమ్మ, నసీమా, రేణుక, పద్మావతమ్మ, ఈశ్వరమ్మ, ఉమ పాల్గొన్నారు.


