30 ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధం
నందికొట్కూరు: వడ్డేమాన్ గ్రామంలో ఓ రైతు నిర్లక్ష్యం వల్ల 30 ఎకరాల మొక్కజొన్న పంట, 4 ఎకరాల్లో కంది పంట దగ్ధమైన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. బ్రాహ్మణకొట్కూరు ఎస్‌ఐ తిరుపాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బోయ సోమన్న అతని రెండు ఎకరాల్లో మొక్కజొన్న కొయ్యలకు నిప్పు పెట్టారు. ఈ సమయంలో చుట్టూ ఉన్న కొందరు రైతులకు చెందిన మొక్కజొన్న పంట, కంది పంటకు మంటలు వ్యాపించి మొత్తం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో తెలుగు రోషన్నకు చెందిన 10 ఎకరాల మొక్కజొన్న, బ్రాహ్మణకొట్కూరుకు చెందిన అబ్దుల్ రహిమాన్–7 ఎకరాలు, ముర్తుజావలి–4, ఈశ్వరన్న–5, నూరుల్లా–4, నాగపుల్లన్నకు 4 ఎకరాల కంది పంట మొత్తం దగ్ధమైంది. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ తిరుపాలు పొలాలను పరిశీలించారు. రైతుల ఫిర్యాదు మేరకు బోయ సోమన్నపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


