న్యాయపోరాటం చేస్తాం
గ్రామ కంఠం భూమి అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్, ఆదోని సబ్‌కలెక్టర్, తహసీల్దార్లకు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎందుకు పట్టించుకోవటం లేదు. అధికార పార్టీ నాయకుల చెప్పిందే రెవిన్యూ అధికారులు పాటిస్తున్నారనే అనుమానాలు మాకు ఉన్నాయి. గ్రామ కంఠంలో కొన్ని సంవత్సరాలుగా దిబ్బలు వేసుకుంటున్నారు. మహిళలు బహిర్భూమికి వెళ్లేవారు. ఇప్పుడు నాయకులు అక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం.
– శంకర్, మల్లారిపేట, గుడేకల్ గ్రామం
కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న స్థలంలో ఎరువు దిబ్బలు, వరిగడ్డి వాములు వేసుకుంటున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల మాటవిని మమ్మల్ని స్థలం లోకి రాకూడదని చెప్పితే ఎలా? మాకు స్థలం చూపించాలి. ఇంటి ముందు దిబ్బలు వేసుకోవటానికి స్థలం లేదు.
–మహదేవి, మల్లారిపేట, గుడేకల్ గ్రామం
ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అండదండలు మాకు ఉన్నాయని, మమ్మల్ని ఏమి చేసుకోలేరని గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు బెదిరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ వేధింపులు ఎక్కువ అయ్యాయి. ఆక్రమించుకోవాలని చూసే తెలుగుదేశం పార్టీ నాయకులది 4వ వార్డు. మాది 3వ వార్డు. మా కాలనీలో వారి దౌర్జన్యం ఏమిటి? ప్రజల సహనం కోల్పోయి ఏమైనా జరిగితే దీనికి అధికారులు, ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
– తిమ్మయ్య, మల్లారిపేట, గుడేకల్
న్యాయపోరాటం చేస్తాం
న్యాయపోరాటం చేస్తాం


