బియ్యం గింజలతో పరమ శివుడు
కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని నంద్యాలకు చెందిన చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ బియ్యపు గింజలతో పరమశివుడు రూపాన్ని ఆవిష్కరించారు. కుంచె, రంగులు లేకుండా స్కెచ్‌లు ఉపయోగించకుండా బియ్యపు గింజలను పలకమీద పోస్తూ చేతి వేలితో బియ్యపు గింజలను క్రమంగా సరి చేస్తూ శివయ్య రూపాన్ని ఆవిష్కరించారు. గంగాదేవి, సిగలో నెలవంక, మెడలో నాగరాజు(పాము), త్రిశూలం, ఓం ఆకారం, కార్తీక ప్రమిదలను చిత్రంలో రూపొందించడంతో కోటేష్‌ను పలువురు
అభినందించారు. – నంద్యాల(అర్బన్)


