రాయల్టీ సిబ్బందితో వాగ్వాదం
కొలిమిగుండ్ల: బెలుం సమీపంలో శుక్రవారం రాయల్టీ వసూలు చేసే ప్రైవేట్ సిబ్బంది, మైనింగ్ యజమానులు, కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని నాపరాతి గనుల నుంచి పెద్దగా ఖరీదు చేయని రాళ్లను ట్రాక్టర్‌లో తీసుకెళుతుండటంతో ప్రైవేట్ సంస్థ సిబ్బంది బెలుం ప్రధాన రహదారిపైకి చేరుకోగానే జీపులో వచ్చి ట్రాక్టర్‌ను అడ్డుకుని రాయల్టీ చెల్లించాలని పట్టుబట్టారు. కొద్ది సేపటికే యజమానులు, కార్మికులు అక్కడ గుమికూడి సిబ్బందితో వాదోపవాదానికి దిగారు. గనుల్లో వృథాగా ఉన్న వాటిని తీసుకెళుతున్నారని వాటికి రాయల్టీ చెల్లించాలంటే ఎలా అని ప్రశ్నించారు. సిబ్బంది మాత్రం రాయల్టీ చెల్లించాలని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్ల లోడ్‌తో ఉన్న ట్రాక్టర్‌ను యజమానులు అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. వృధా రాళ్లకు కూడా రాయల్టీ ఇవ్వాలనడం దారుణమని యజమానులు మండిపడ్డారు.
మత్తు పదార్థాలకు
దూరంగా ఉండాలి
ఆలూరు: మత్తు పదార్థాలకు ప్రజలు దూరంగా ఉండాలని సెట్కూర్ సీఈఓ డాక్టర్ వేణుగోపాల్ సూచించారు. శుక్రవారం స్థానిక జూనియర్ కళాశాలలో మత్తుపదార్థాలు, వ్యసనాలు వాటివల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల దేశంలో ఏటా 1.40 లక్షల మంది మరణిస్తున్నారన్నారు. యవత డ్రగ్స్‌కు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నాయని వివరించారు. డ్రగ్స్, మత్తు పదార్థాలకు ప్రజలు, యువత దూరంగా ఉండాలని సూచించారు. ఎకై ్సజ్ సీఐ లలిత, ప్రిన్సిపాల్ రమాదేవి, సిబ్బంది శశికుమార్, పాండురంగ తదితరులు ఉన్నారు.
రాయల్టీ సిబ్బందితో వాగ్వాదం


