జాగ్రత్తలు తీసుకోవాలి
కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వారిలో 50 శాతం డయాబెటీస్ రోగులే ఉన్నారు. షుగర్ రోగులు వారి మూత్రంలో యూరిన్ ప్రొటీన్ ఎక్కువగా వెళ్తుంటే జాగ్రత్తలు తీసుకోవాలి. మూత్రంలో నురగ, కాళ్లవాపులు, రాత్రిపూట మూత్రంకు ఎక్కువసార్లు వెళ్లడం దీని లక్షణాలు. షుగర్ వచ్చి ఐదేళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూరిన్ ప్రొటీన్ క్రియాటినిన్ రేషియో పరీక్ష చేయించుకోవాలి. క్రియాటినిన్ 1.2 దాటితే కిడ్నీ జబ్బు ప్రారంభమైందని గుర్తించాలి. బీపీ, షుగర్ నియంత్రణలో ఉంచుకోవాలి. పెయిన్ కిల్లర్స్ వాడకూడదు.
– డాక్టర్ పీఎల్. వెంకట పక్కిరెడ్డి,అసిస్టెంట్ ప్రొఫెసర్,
నెఫ్రాలజి విభాగం, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల


