ఎముకల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
షుగర్ రోగుల్లో ఎముకల ఆరోగ్యం తగ్గిపోతోంది. తక్కువ ఎత్తు నుంచి కింద పడినా కొందరి ఎముకలు విరుగుతున్నాయి. కొందరు నిద్ర నుంచి లేచిన వెంటనే కళ్లు తిరిగి కింద పడతారు. షుగర్ రోగుల్లో న్యూరోపతి వచ్చి నడిచేటప్పుడు అదుపు తప్పి కిందపడే అవకాశం ఉంది. మహిళలు పయోగ్లిటజోన్ అనే మందు వాడటం వల్ల ఎముకలు బలహీనమవుతున్నట్లు ఇటీవల పరిశోధనల్లో తేలింది. ఎముకల బలాన్ని తెలుసుకునేందుకు జీజీహెచ్‌లో డెక్సా స్కాన్ చేసి, ఎముకల సాంధ్రత తక్కువగా ఉన్న వారికి చికిత్స అందిస్తున్నాం.
– డాక్టర్ పి. శ్రీనివాసులు, ఎండోక్రైనాలజీ హెచ్‌వోడీ,
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల


