నాలుగు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
కోడుమూరు రూరల్: హంద్రీనది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను గురువారం కోడుమూరు పోలీసులు పట్టుకున్నారు. ‘బరి తెగించిన ఇసుకాసురులు’ అన్న శీర్షిక ఈనెల 12వతేదీన ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన వార్తకు పోలీసులు ఈ మేరకు స్పందించారు. వర్కూరుకు చెందిన రెండు ట్రాక్టర్లు, కృష్ణగిరి మండలం పోతుగల్లుకు చెందిన రెండు ట్రాక్టర్లను పట్టుకున్నారు. రెండు ట్రాక్టర్లకు సంబంధించిన డ్రైవర్లు పారిపోగా, మరో ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్ యాజమానులపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కర్నూలు(అగ్రికల్చర్): ఏపీజీఎల్‌ఐలో 2024 ఏప్రిల్ నుంచి అమలులోని ఇన్సూరెన్స్ ఆటోమేటిక్ సిస్టమ్ విజయవంతంగా నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా డైరెక్టర్ రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన కర్నూలులోని ఏపీజీఎల్‌ఐ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఏపీజీఎల్‌ఐ ఇన్సూరెన్స్ ఆటోమేటిక్ సిస్టమ్, నిధి పోర్టల్ అమలు తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉద్యోగంలో చేరిన వారు దరఖాస్తు చేసుకుంటేనే బీమా అమలయ్యేదని, బీమా బాండు పొందడం కూడా కష్టతరమయ్యేదన్నారు. ఇన్సూరెన్స్ ఆటోమేటిక్ సిస్టం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏపీజీఎల్‌ఐ తప్పనిసరి చేశారన్నారు. ప్రతి నెలా రూ.800 నుంచి రూ.3వేల వరకు ప్రీమియం ఉంటుందన్నారు. బీమా బాండు కూడా సంబంధిత డీడీఓనే ఆన్‌లైన్‌లో జనరేట్ చేస్తారన్నారు. నిధి పోర్టల్ ద్వారా ఏపీజీఎల్‌ఐ నుంచి లోన్ పొందడం సులువైందన్నారు. కార్యక్రమంలో ఏడీలు రంజిత్‌కుమార్ నాయుడు, గౌరిప్రసన్న, పర్యవేక్షకులు శివనాగకుమార్, రామకృష్ణారెడ్డి, కళ్యాణి తదితరులు పా ల్గొన్నారు. ఇదిలాఉంటే డైరెక్టర్ రెడ్డి శ్రీనివాస్‌తో ఏపీన్‌జీజీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జవహర్‌లాల్ ఆధ్వర్యంలో పలువురు సంఘం నాయకు లు సమావేశమయ్యారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
నాలుగు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
నాలుగు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత


