కొలనుభారతి పూజార్లపై చర్యలు తీసువాలి
● కాకనూరు శారద పీఠం పీఠాథిపతి
కొత్తపల్లి: అమ్మవారి పూజల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొలనుభారతి ఆలయ పూజార్లపై చర్యలు తీసుకోవాలని కాకనూరు శారధ పీఠం పీఠాధిపతి శివయోగేంద్ర సరస్వతి స్వామి అధికారులను కోరారు. గురువారం ఆయన క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కాగా ఉదయం 8 గంటల లోపు అన్ని పూజలు పూర్తిచేసుకొని భక్తులకు దర్శనమివ్వాల్సిన అమ్మవారికి పురోహితులు 9.20 గంటలైనా పూజలు చేయకపోవడంతో ఆయన మండిపడ్డారు. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్న ఆల య పురోహితుల ప్రవర్తనలో మార్పురాకపోతే దేవ దాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నా రు. ఆలయాన్ని శ్రీశైలం దేవస్థానానికి అనుసంధానం చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులు, ఛారుఘోషిణి నది విస్తరణ, డార్మెంటరీ, ప్రత్యేక క్యూలైన్లు నిర్మాణానికి శ్రీశైల దేవస్థానం కృషి చేయాలని కోరారు.


