జాతీయ లోక్‌ అదాలత్‌ కేసుల పరిష్కారం పెరగాలి | - | Sakshi
Sakshi News home page

జాతీయ లోక్‌ అదాలత్‌ కేసుల పరిష్కారం పెరగాలి

Nov 13 2025 7:56 AM | Updated on Nov 13 2025 7:56 AM

జాతీయ

జాతీయ లోక్‌ అదాలత్‌ కేసుల పరిష్కారం పెరగాలి

కర్నూలు(సెంట్రల్‌): డిసెంబర్‌ 13వ తేదీన నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసుల పరిష్కరించేందు కు చర్యలు తీసుకోవాలని జిల్లాప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షుడు జి.కబర్ధి ఆదేశించారు. బుధవారం జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రితో కలసి జిల్లాలోని వివిధ కోర్టుల్లో పనిచేసే న్యాయమూర్తులతో జాతీయ లోక్‌ అదాలత్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రాజీకాదిగన కేసులు, ఎకై ్సజ్‌, మెటార్‌ యాక్సిడెంట్‌, చెక్‌బౌన్స్‌, భూసేకరణ, సివిల్‌ కేసులను జాతీయ లోక్‌ అదాలత్‌లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిరోజూ ప్రీలోక్‌ అదాలత్‌లను పెట్టి త్వరతిగతిన ఎక్కువ కేసులు పరిష్కరించేలా కృషి చేయాలని కోరారు. సదస్సులో మొదటి అదనపు జిల్లా జడ్జి కమాదేవి, అరో అదనపు జిల్లా జడ్జి వాసు, ఏడో అదనపు జిల్లా జడ్జి లక్ష్మీరాజ్యం, సీబీఐ కోర్టు జడ్జి శోభారాణి, ఫోక్సోకోర్టు జడ్జి రాజేంద్రబాబు, ఏసీబీ కోర్టు శ్రీవిద్య, శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ వెంకట హరినాథ్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జీలు మల్లేశ్వరి, దివాకర్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జీలు సరోజమ్మ, అపర్ణ, అనిల్‌కుమార్‌, అనూష పాల్గొన్నారు.

మహిళ ఆత్మహత్య

ఆళ్లగడ్డ: పట్టణంలోని ఎస్వీ నగర్‌లో ఓ మహిళ బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. రుద్రవరం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన యోహాను కూతురు సీతమ్మ (31)కు చందలూరు గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తితో వివాహమైంది. ఈ మధ్యకాలంలో సీతమ్మ మానసిక వ్యాధితో ఇబ్బంది పడుతుండటంతో ఎస్వీనగర్‌లో ఉన్న తండ్రికి వద్దకు చేరింది. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పుకు ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు కిందకు దించి చూసేసరికి అప్పటికే మృతి చెందింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ మృతి

ఆళ్లగడ్డ: పట్టణ శివారులోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ శివయ్య (50) మృతి చెందాడు. పట్టణంలోని ఎస్వీ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ శివయ్య మంగళవారం రాత్రి పొద్దుపోయాక పట్టణ శివారులోని టిడ్కో గృహాల్లో ప్రయాణికుడిని దించి తిరిగి వచ్చేక్రమంలో జాతీయ రహదారిపైకి వస్తుండగా వెనుకవైపు నుంచి వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శివయ్యను ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వ్యవసాయాధికారుల తనిఖీలు

కర్నూలు(అగ్రికల్చర్‌): జీవన ఎరువులు (బయో పర్టిలైజర్స్‌), సూక్ష్మ పోషకాలు ఉత్పత్తి చేసే కంపెనీల్లో బుధవారం వ్యవసాయ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి జిల్లా వ్యవసాయ అధికారి జీవన ఎరువులు, సూక్ష్మ పోషకాలు ఉత్పత్తి చేసే సంస్థల్లో తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. ఇందు లో భాగంగా కర్నూలు క్రిష్ణానగర్‌లోని పుష్పా ంజలి అగ్రీటెక్‌, చౌరస్తాలోని ఎస్‌ఎస్‌ఎల్‌వీ టెక్నాలజీస్‌లో జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్‌ వరలక్ష్మి, కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, కల్లూరు మండల వ్యవసాయ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి, డీఏవో కార్యాలయం సాంకేతిక ఏవో రాఘవేంద్ర టీమ్‌ గా వెళ్లి తనిఖీలు చేపట్టారు. వీటిల్లో తయారవుతున్న ఉత్పత్తులను పరిశీలించారు. అనుమతుల పత్రాలు, రికార్డులు, ల్యాబ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా పుష్పాంజలి అగ్రిటెక్‌లో మూడు శ్యాంపుల్స్‌ సేకరించి ప్రయోగశాలకు పంపారు. అన్ని రకాల అనుమతులతో జీవన ఎరువులు ఉత్పత్తి చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.

జాతీయ లోక్‌ అదాలత్‌ కేసుల పరిష్కారం పెరగాలి 1
1/2

జాతీయ లోక్‌ అదాలత్‌ కేసుల పరిష్కారం పెరగాలి

జాతీయ లోక్‌ అదాలత్‌ కేసుల పరిష్కారం పెరగాలి 2
2/2

జాతీయ లోక్‌ అదాలత్‌ కేసుల పరిష్కారం పెరగాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement