కష్టానికి ఫలితం
మాది అనంతపురం జిల్లా బత్తలపల్లి. అమ్మలేరు, నాన్న ఉపాధ్యాయుడు. ఆర్‌యూసీఈలో ఈసీఈ బ్రాంచ్‌తో బీటెక్ పూర్తి చేశాను. బ్రాంచ్‌లో టాపర్‌గా నిలిచి కుటుంబ సభ్యుల సమక్షంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్‌మెడల్ అందుకోవడం చాలా గర్వంగా ఉంది. నేను చదువుకున్న కోర్సులో టాపర్‌గా నిలవడంతో కష్టానికి ఫలితం లభించింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా రాణించాలని ఉంది.
– యశ్విత, బీటెక్ విద్యార్థి
మాది ఎమ్మిగనూరు. తల్లిదండ్రులు క్లాత్ బిజినెస్ చేస్తున్నారు. నేను ఎమ్మెస్సీ కంప్యూటర్స్‌లో పీజీ పూర్తి చేశాను. కోర్సులో డిపార్ట్ మెంట్‌లో టాపర్‌గా నిలిచాను. నాల్గవ స్నాతకోత్సవంలో గవర్నర్‌గా చేతుల మీదుగా గోల్డ్ మెడల్ తీసుకోవడం సంతోషంగా ఉంది. కంప్యూటర్స్ రంగంలో ప్రొఫెషనల్‌గా స్ధిరపడాలని ఉంది. ఎంచుకున్న కోర్సులో ఇష్టంతో చదివితే అనుకూలమైన ఫలితాలు వస్తాయి.
– ప్రభావతి, ఎమ్‌ఎస్సీ కంప్యూటర్స్
●
కష్టానికి ఫలితం


