సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా స్థిరపడతా..
మాది నందికొట్కూరు. ఆర్‌యూసీఈలో సీఎస్‌ఈ బ్రాంచ్‌తో బీటెక్ పూర్తి చేశాను. బ్యాచ్‌లో టాపర్‌గా, కోర్సులో టాపర్‌గా నిలిచి రెండు గోల్డ్ మెడల్స్ అందుకోవడం గర్వంగా ఉంది. పాఠాలు బోధించిన అధ్యాపకులు, ఫ్రెండ్స్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉంది. మంచి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా స్థిరపడాలన్నది నా లక్ష్యం.
– ఖాజ మొయినుద్దీన్, బీటెక్ విద్యార్థి
మాది అవుకు మండలం చెర్లోపల్లె. నాన్న దాసరి పెద్దరాజు, అమ్మ రాజ్యలక్ష్మి వ్యవసాయం చేస్తూ ముగ్గురు ఆడపిల్లలను కష్టపడి చదివిస్తున్నారు. పెద్ద కుమార్తె అయిన నేను చదువు లో ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. పీహెచ్‌డీ రీసెర్చ్ చేయడమే నా లక్ష్యం. – శిరీష, ఎమ్మెస్సీ బాటనీ
మాది వెల్దుర్తి. నా తల్లిదండ్రులు హసీనా, ఫరీద్‌బాబా. నేను ఆర్‌యూలో 2020–22లో ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశా. ఆర్‌యూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వెంకట బసవరావు చేతుల మీదుగా గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ అందుకోవడం ఆనందంగా ఉంది.
– షేక్ ఇర్ఫాన్, ఎమ్మెస్సీ కంప్యూటర్స్
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా స్థిరపడతా..


